Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆన‌ర్ వ్యూ10 ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌... అందుబాటులోకి వ‌చ్చిన ఫేస్ అన్‌లాక్‌

  • జ‌న‌వ‌రి 24లోగా అప్‌డేట్‌
  • ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖం గుర్తింపు
  • ఇదే బాట‌లో ప‌య‌నించ‌నున్న ఒప్పో, వ‌న్‌ప్ల‌స్‌
హావాయ్ వారి ఆన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల చేస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ అప్‌డేట్‌తో ఆయా ఫోన్ల‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 24లోగా ఈ ఓవ‌ర్ ద ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్ వ‌స్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించాలంటే అప్‌డేట్ వ‌చ్చాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌ని రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 29,999 విలువ గ‌ల ఈ ఆన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే దొరుకుతుంది. ఆక్టాకోర్ కిరిన్ 970 చిప్‌సెట్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లో ఉన్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీ యూజ‌ర్ ముఖాన్ని, స్థానాన్ని గుర్తించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఇదే బాట‌లో వ‌న్‌ప్ల‌స్‌, ఒప్పోలు కూడా ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ని అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.
honor
view 10
face unlock

More Telugu News